హ్యాపీ బర్త్ డే….ఇలియానా

63
ileyana

దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం పాటు కొనసాగింది. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఎంటర్‌టైన్ చేస్తోంది.

బాలీవుడ్ లో నిలబడాలంటే అందాలను ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఫాలో అవుతోంది సుందరి. ఇక అక్కడికి వెళ్లాకే ఇలియానా అన్నీ అందాలను చూసే భాగ్యం అభిమానులకు దొరికిందట. తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా వర్కౌట్ కాలేదు . రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది . దాంతో తెలుగు సినిమాల వైపు చూడటం కూడా మానేసింది ఇలియానా . ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ హాట్ అందాలను షేర్ చేస్తూన్న ఈ గోవా బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.