రాష్ట్రంలో లక్షా 30 వేలు దాటిన కరోనా కేసులు…

157
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 30 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,30,589కి చేరాయి. 97,402 బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా 846 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,341 యాక్టివ్ కేసులున్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే… జీహెచ్ఎంసీ లో 477 కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డిలో 234, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 192, క‌రీంన‌గ‌ర్ 152, న‌ల్ల‌గొండ 174, ఖ‌మ్మం 128, ‌వ‌రంగ‌ల్ అర్బ‌న్ 116, సూర్యాపేట 108, సిద్దిపేట 108, నిజామాబాద్ 110, జ‌గిత్యాల 102 నమోదయ్యాయి.

పెద్ద‌ప‌ల్లి 85, మంచిర్యాల 83‌‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం 81, ‌సంగారెడ్డి 71, కామారెడ్డి 64, మ‌హ‌బూబాబాద్ 61, యాదాద్రి భువ‌న‌గిరి 60, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 53, వ‌న‌ప‌ర్తి 51, నాగ‌ర్‌క‌ర్నూల్ 45, జ‌న‌గాం 43,వికారాబాద్ 15, ఆసిఫాబాద్ 13, నారాయ‌ణ‌పేట జిల్లాలో 12 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -