మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ ఇందు

131
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ డాన్సు మాస్టర్ సత్య మాస్టర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మణికొండలోని తమ అపార్ట్ మెంట్ ముందు మొక్కలు నాటారు ప్రముఖ యాంకర్ ఇందు.

ఈ సందర్భంగా యాంకర్ ఇందు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఒకరు మొక్కలు నాటి మరో ముగ్గురికి చాలెంజ్ చేయడం అనే ఆలోచన చాలా బాగా ఉందని ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.

ఎప్పుడూ నా మంచి కోరే సత్య మాస్టర్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని హైదారాబాద్ అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల మనకు సరైన స్థలం లేని కారణంగా మొక్కలు పెంచలేక పోతున్నామని అయినప్పటికీ ఇంట్లో గానీ ఇంటి బయట గాని ఉన్న స్థలంలో మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ సందర్భంగా యాంకర్ లాస్య; యాంకర్ నిదిన్; అదేవిధంగా నా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా మొక్కలు నాటి వాటిని నాకు సోషల్ మీడియాలో పంపాలని కోరారు.