రాష్ట్రంలో 24 గంటల్లో 2296 కరోనా కేసులు…

154
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 2296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,77,070 చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 యాక్టివ్‌ కేసులుండగా 1,46,135 మంది కరోనా నుండి కోలుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 321,రంగారెడ్డిలో జిల్లాలో 271,మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 173, నల్గొండలో 155, కరీంనగర్‌లో 136, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 99, సిద్దిపేటలో 92, నిజామాబాద్‌లో 82, సంగారెడ్డిలో 81 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.59శాతం ఉండగా రికవరీ రేటు 82.52శాతంగా ఉంది. ఇప్పటివరకు 26,28,897 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -