తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను రోజులైంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలు గట్టిగానే దృష్టి సారించారు. ఆల్రెడీ 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించగా.. మరికొంత మంది కూడా చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణలో ప్రస్తుతం మంత్రి పదవి కోసం గట్టిగానే పోటీ నడుస్తోంది. పార్టీలోని చాలా మంది కేబినెట్ రేస్ లో ఉన్నారు. ప్రధానంగా మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ వంటి వారు పదవులు ఆశిస్తుండగా.. మైనంపల్లి హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గడ్డం వినోద్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుమోహన్ రావు, భోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి వంటి వారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. .
వీటితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వీరిలో ఎవరిని ఎన్నుకొవాలనే దానిపై రేవంత్ రెడ్డి ముమ్మర కసరత్తులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణలో భాగంగా నేడు గాంధీ భవన్ లో నేడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇంచార్జ్ ఠాక్రే మరియు ముఖ్యనేతలంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఎంపిక చేసిన నేతలను అధిష్టానం ముందు ప్రవేశ పెట్టి ఆ తరువాత కేబినెట్ లో చోటు దక్కిన వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేబినెట్ లో చోటు ఆశించిన చాలా మందికి చోటు దక్కే అవకాశం లేకపోవడంతో వారిని ఎలా బుజ్జగించాలనే దానిపై కూడా కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ పై కూడా త్వరలో ఓ నిర్ణయానికి వచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వడి వడిగా అడుగులు వేస్తోంది.
Also Read:చలికాలంలో చేపలు తినడం మంచిదేనా?