అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్!

40
- Advertisement -

అధికారం మాదే.. వచ్చేది మేమే.. మాకు తిరుగేలేదు.. ఇవి నిన్న మొన్నటి వరకు బీజేపీ నేతలు చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు. కానీ ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు, ఇలా ఎన్నో కాషాయ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా ఎన్నికల రేస్ లో అసలు కాషాయ పార్టీ ఉందా ? అనే సందేహాలు వచ్చేలా సైలెన్స్ పాటిస్తున్నారు కమలనాథులు. దీంతో ముందు పార్టీలోని లొసుగులను చక్కదిద్దుకొని ఆ తరువాత అధికారం కోసం ప్రయత్నించాలని రాజకీయవాదులు కమలం పార్టీకి చురకలాంటిస్తున్నారు. ఇప్పుడు అదే తాటాకు చప్పుళ్లను కాంగ్రెస్ చేస్తోంది. గత మూడు నెలలకు ముందు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉందా లేదా అనే రీతిలో భూస్థాపితం అయిన పార్టీ.. ఇప్పుడేమో నానా హడావిడి చేస్తోంది. అయితే హస్తం పార్టీ హడావిడి అంతా ఆరిపోయే దీపానికి వెలుగేక్కువ అన్న రీతిలోనే ఉంది.

మొన్నటి వరకు సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేలా విభేదాలు వ్యక్తం చేసిన హస్తం నేతలు ఇప్పుడేమో దోస్త్ మేర దోస్త్ అంటూ ఒకే తాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు పార్టీలోని సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన విభేదాలు ప్రజలు తెలియందేమీ కాదు. కానీ ఇప్పుడు కడుపులో కత్తులు దాచుకొని పైపైకి చేయి కలుపుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టె ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మొత్తానికి ఎన్నికల వేళ నానా హడావిడి చేస్తూ హస్తం నేతలు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారనేది జగమెరిగిన సత్యం.

Also Read:వన్డేల్లో విరాట్ సరికొత్త చరిత్ర

- Advertisement -