వన్డేల్లో విరాట్ సరికొత్త చరిత్ర

50
- Advertisement -

వన్డేల్లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ బౌలర్లను చిత్తు చేసి సెంచరీ సాధించాడు. దీంతో సచిన్‌ పేరుపై ఉన్న రికార్డును అధిగమించాడు విరాట్. ఇప్పటివరకు సచిన్ 49 సెంచరీలతో టాప్‌లో ఉండగా విరాట్ దానిని అధిగమించాడు. సెంచరీ తర్వాత గ్రౌండ్‌లోని ప్రేక్షకులంతా నిలిచి విరాట్‌కు విషెస్ చెప్పారు.

విరాట్ 272 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా సచిన్ 462 ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు చేశాడు. వీరిద్దరి తర్వాత రోహిత్ 31,రికీ పాంటింగ్ 30 ఉన్నారు. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరుపైనే ఉంది. సచిన్‌ – 100 సెంచరీలు చేయగా తర్వాత కోహ్లీ 80 సెంచరీలతో ఉన్నారు. సెంచరీ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు విరాట్.

Also Read:Mehreen:‘స్పార్క్’ మూవీ అందరిని మెప్పిస్తుంది

- Advertisement -