తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి అసంతృప్తి సెగ తగులుతోంది. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్ , టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. పార్టీల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ కు 94, టీడీపీకి 14, టీజేఎస్ 8, సిపిఐ4 స్ధానాల్లో బరిలోకి దిగనుంది. అయితే కొన్ని చోట్ల ఇరు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు హైకమాండ్ వద్ద తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి టికెట్ టిడిపి కి కేటాయిస్తున్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో గాంధీభవన్ వద్ద బిక్షపతి యాదవ్ అనుచరులు తీవ్ర ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా మల్కాజ్ గిరి టికెట్ ను జనసమితికి కేటాయించడంపై వస్తున్న వార్తలపై ఈ రోజు వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీనేత నందికంటి శ్రీధర్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా మల్కాజ్ గిరి కాంగ్రెస్ నేతలు నేడు గాంధీభవన్ లో అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.