- Advertisement -
యాదాద్రి దర్శనంకు బయలుదేరిన సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, చిలుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఈవో గీతారెడ్డి ఉన్నారు.
సీఎం కేసీఆర్ తన కుటుంబం తరఫున ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. బాలాలయం ఆవరణలో కళావేదిక కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు గుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
- Advertisement -