CMKCR:నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్‌ కార్యాలయం ప్రారంభం

75
- Advertisement -

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్‌ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం నాగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు.

Also Read: పవన్ కాన్ఫిడెన్స్ కు కారణం అదే ?

నాగ్‌పూర్‌లోని గాంధీబాగ్‌లో విశాలమైన స్థలంలో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్ఎస్‌ భవన్‌ను పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరమంతటా అబ్‌కి బార్‌ కిసాన్ సర్కార్‌ అనే హోర్డింగ్‌లతో దర్శనమిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

Also Read: విపక్షాలే టార్గెట్.. అదంతా షా వ్యూహమే !

- Advertisement -