- Advertisement -
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ములాయం తనయుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. అఖిలేశ్‌తో మాట్లాడి ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దసరా పండుగ తర్వాత స్వయంగా వచ్చి కలుస్తానని ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ తెలిపారు.
- Advertisement -