రేపు జరగబోయే ప్రగతి నివేదన సభ రోజే.. రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ టైంని ఫిక్స్ చేశారు.
అయితే ప్రగతి నివేదన సభలో చర్చించే అంశాలపై ఈ భేటీలో సీఎం మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఐఆర్ పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా 22నుంచి 30శాతం మధ్య ఎంప్లాయిస్ కు ఐఆర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. .కాగా.. ఈ భేటీలో రాజకీయం అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇక ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాలు.. త్వరలో చేపట్టబోయే సంక్షేమ పథకాలపై డిస్కస్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే..ఇప్పటికే ముందస్తు ఎన్నికలు అని ప్రచారం జరుగుతుండటం.. ప్రగతి నివేదన సభ రోజే.. కేబినెట్ భేటీ జరగనుండటంతో.. రాజకీయ వర్గాల్లో ఈ భేటీ హాట్ టాపిక్ గా మారింది.
State cabinet will meet on 2nd September at 1 PM in Pragathi Bhavan.
— Telangana CMO (@TelanganaCMO) August 31, 2018