పదిమంది మంత్రులతో తెలంగాణ కేబినెట్‌ను విస్తరించనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్తమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు గవర్నర్ నరసింహన్.ఇక మంత్రులకు కేటాయించే శాఖలపై పలు ఉహాగానాలు వెలువడుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ,ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యవసాయ శాఖ,తలసానికి పౌరసరఫరాల శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు సంక్షేమ శాఖలు,కొప్పుల ఈశ్వర్‌కు విద్యాశాఖ,వేముల ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమలు,ఇంద్రకరణ్ రెడ్డికి వైద్య,ఆరోగ్యం,వి శ్రీనివాస్ గౌడ్‌కు మున్సిపాలిటీ,ఎక్సైజ్ శాఖ,జగదీశ్ రెడ్డికి రోడ్లు,భవనాలు,మల్లారెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించనున్నట్లు సమాచారం.
నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు శాఖలు సీఎం కేసీఆర్ వద్దే ఉండనున్నాయి. ఖమ్మం మినహా పాత జిల్లాలు అన్నింటికీ ప్రాతినిధ్యం లభించగా తర్వాతి విస్తరణలో మహిళలు, గిరిజన కోటాలో అవకాశం కల్పించనున్నారు.
కేబినెట్ విస్తరణలో చోటు దక్కనున్న వారిలో ఆరుగురు కొత్తవారే. గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్,జగదీశ్‌రెడ్డి ,ఇంద్రకరణ్‌రెడ్డి,తలసాని శ్రీనివాస్‌యాదవ్ లకు రెండోసారి అవకాశం దక్కింది.