21న తెలంగాణ కేబినెట్‌ భేటీ

17
- Advertisement -

21న (రేపు) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. ప్రధానంగా రుణ‌మాఫీ, అసెంబ్లీ స‌మావేశాలు, బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, పంట‌ల బీమాతో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని రేవంత్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనాకు రాగా ఇందుకోసం నిధులను జమచేసే పనిలో పడింది.

రుణ మాఫీతో పాటు రైతు భరోసా అమలుకు రూ.7 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపుపై చర్చించనున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశంలో రైతు భరోసాకు కటాఫ్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:సన్నీ డియోల్‌తో గోపిచంద్!

- Advertisement -