తెలంగాణ కేబినెట్‌ సమావేశం..

27
- Advertisement -

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీలపై చర్చ జరగనుంది. నిన్నటితో ప్రజా పాలన కార్యక్రమం ముగియగా 5 గ్యారంటీలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 100 రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్‌ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అర్హులైన లబ్దిదారులకే 6 గ్యారంటీలని ఇప్పటికే స్పష్టం చేసింది ప్రభుత్వం.

త్వరలోనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుండగా అర్హులందరికీ సాయం అందాలని తెలిపారు సీఎం రేవంత్. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. జాబ్‌ క్యాలెండర్‌పైనా కేబినెట్‌ మీటింగ్‌లో చర్చ జరిగే అవకాశం ఉండగా ఫిబ్రవరిలోనే దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే ఛాన్స్ ఉంది. కేబినెట్‌లో కార్పొరేషన్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణపైనా చర్చించే ఛాన్స్ ఉంది.

Also Read:వెంకీ, నాగ్.. హిట్ కొట్టేనా?

- Advertisement -