ఐసిఎమ్మార్ ప్రివలెన్సు సర్వేలో తెలంగాణ భేష్..

288
icmr survey
- Advertisement -

తెలంగాణ లో కమ్యూనిటీ వ్యాప్తి లేదు. ఐసీఎమ్మార్ సర్వేలో అతి తక్కువ మందికి పాజిటివ్..దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందనే దానిపై ఐసీఎమ్మార్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లు జరిపిన సిరం సర్వేల్లో రాష్ట్రంలో తీసిన శ్యాంపిల్స్ లో తక్కువ అతి తక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

కరోనా వ్యాప్తి పరిశోధనల్లో భాగంగా తెలంగాణా లో రూరల్, అర్బన్ లో ప్రత్యేకంగా ఐసీఎమ్మార్ ప్రివలెన్స్ సర్వే నిర్వహించాయి.. ముందుగా మే నెల 15 నుంచి 17 వరకు రూరల్ ప్రాంతాలయిన జనగాం, కామారెడ్డి, నల్గొండ లో ఒక్కో జిల్లాలో 400 ల శ్యాంపిల్స్ చొప్పున మొత్తం 1200 ల శ్యాంపిల్స్ సేకరిస్తే, 4 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి.

మరోపక్క అర్బన్ ప్రాంతాల్లో జరిగిన సర్వేలో భాగంగా హైదరాబాద్ లోని 5 కంటైన్మెంట్ జోన్లలో అధిబట్ల, టప్పచపుత్ర, మియపూర్, చందనగర్ , బాలాపూర్ లలో 30, 31 తేదీల్లో సిరం సర్వే నిర్వహించి ఒక్కో జోన్ లో 100 శ్యాంపిల్స్ చొప్పున మొత్తం 500 ల శ్యాంపిల్స్ సేకరించారు. అయితే హైదరాబాద్ లో జరిగిన సిరం సర్వేలో 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది..లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేయడం వల్లనే కరోనా కట్టడి సాధ్యం అయ్యింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

- Advertisement -