పాపం ఆటోవాలా.. కనికరం చూపరేలా?

36
- Advertisement -

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినది మొదలుకొని ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బతుకుబండిని ముదుకు సాగించేందుకు ఆటోనే నమ్ముకున్న డ్రైవర్లు నేడు బతుకు జీవుడా అని మొరపెట్టుకునే పరిస్థితికి రావడం నిజంగా దయనీయమైన అంశమే. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో మహిళలంతా బస్సు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రమంతటా కూడా ఆటోలు, క్యాబ్ లు బోసిపోతున్నాయి. ప్రయాణికులు లేక ఎక్కడ చూసిన కాళీ ఆటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో తమ బతుకు రోడ్డున పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించి మమ్మల్ని రోడ్డున పడేశారని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో ఉచిత హామీల వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని తెలిసికూడా కేవలం ఓటర్లను ఆకర్శించేందుకు ఇలాంటి హామీలు ప్రకటించి ఇతరుల జీవనాధారాన్ని ప్రభుత్వం దెబ్బ కొడుతుందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఆటో డ్రైవర్ల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం వారిని మరింత ఆవేదనకు గురి చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా అధ్యయనం చేసేందుకు ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆటో డ్రైవర్ల సమస్యలు వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తామని బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ హామీ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఆటోవాలా సమస్యలపై బి‌ఆర్‌ఎస్ పార్టీ చూపిస్తున్న చొరవ నిజంగా ప్రశంసనీయం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు.

Also Read:ప్రజాపాలన నిర్వహిస్తున్నాం:సీఎం రేవంత్

- Advertisement -