తెలంగాణ శాస‌న‌స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా..

186
Telangana assembly
- Advertisement -

తెలంగాణ శాస‌న‌స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం తెలంగాణ అసెంబ్లీ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్బంగా చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. కేవలం చట్ట సవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం కాగానే స‌భ‌లో నాలుగు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది.అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం ప్రకటించారు.

స‌భ‌లో ప్రవేశపెట్టిన బిల్లులు:

ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020
తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020
జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020 సభ ఆమోదం తెలిపింది.

సభలో ఆమోదం తెలిపిన సవరణలు:

జీహెచ్ఎంసీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
జీహెచ్ఎంసీ పరిధిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు ఆమోదం.
10 ఏళ్లకు ఒకసారి మాత్రమే రిజర్వేషన్ల మార్పు.
నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీలకు సభ ఆమోదం.
ఈ కమిటీలలో యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజెన్ కమిటీ, ఎమినెంట్ సిటిజెన్ కమిటీలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదించాలనే సవరణకు ఆమోదం.

- Advertisement -