అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం- హోం మంత్రి

730
Mahmood Ali
- Advertisement -

తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి దృష్ఠి కి తీసుకువెళ్లి వారికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి అయిన మహమ్మద్ అలీ తెలిపారు. అగ్రిగోల్డ్ కేసు హైకోర్టు పిటిషనర్ ఆండాళు రమేష్ బాబు ఈ రోజు హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.

హోం మంత్రి స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ వాటిని కొన్నప్పుడు ఎకరా లక్షల్లో ఉంటే ఈరోజు వాటిధర కోట్ల రూపాయలకు పెరిగిందని అన్నారు. బాధితులందరికి తప్పకుండా డబ్బులు వస్తాయని ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అక్కడి బాధితులకు డబ్బుల పంపిణీ జరుగుతున్న విషయం తమకు తెలుసని, న్యాయ పరంగా కూడా తాము సమీక్ష చేసి తమ ప్రభుత్వం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామని హోం మంత్రి హామీని ఇచ్చారు. హోం మంత్రిని కలిసిన వారి లోతెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు మరియు ఏజెంట్లు సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు సువ్వారి రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Agrigold victims Meet To Telangana Home Minister Mahmood Ali..

- Advertisement -