21న సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు..

48
- Advertisement -

తెలంగాణ పూల పండగ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.ఊరూరా వాడవాడలా బతుకమ్మ పాటలతో మార్మోగిపోతున్నాయి. ఇక ఈ నెల 21న సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు.

సంబవాంగ్ పార్క్‌లో జరుగనున్న ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. సింగపూర్‌లో ఉంటున్న ఇతర తెలుగు ప్రజలకు కూడా మన బతుకమ్మను పరిచయడం చేయడం టీసీఎస్‌ఎస్‌కు దక్కిన గౌరవమని నిర్వాహకులు అన్నారు. బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, ఉత్తమ బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తామని తెలిపారు. ప్రతీ ఏడాదిలానే పండుగలో పాల్గొనే వారందరికి ఆహారంతోపాటు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి ముందుకువచ్చిన కమిటీ సభ్యలుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read:ఎలక్షన్ రిపోర్ట్ ; ఇక్కడ సత్తా చాటేదెవరు?

- Advertisement -