బిగ్ బాస్ 2 నుంచి తేజ‌స్వీ ఎలిమినేట్…

234
Tejaswi-Madivada
- Advertisement -

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ 2 హోస్ట్ గా నాని ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. మొద‌ట్లో కాస్త డ‌ల్ ఉన్నా రెండ‌వ వారం నుంచి చాలా ఆస‌క్తిగా సాగుతుంది. రోజురోజుకి బిగ్ బాస్ 2పై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఎవ‌రు ఎలిమినెట్ అవుతారో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. మొద‌ట్లో నాని చెప్పిన‌ట్టుగా బిగ్ బాస్ హౌజ్ లో ఏదైనా జ‌ర‌గొచ్చు అన్న‌ట్టుగా ఎలిమినేషన్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది.

tejaswi-madivada

బిగ్ బాస్ హౌజ్ యాక్టివ్ గా ఉంటూ..ఇత‌రుల‌తో వివాదాలు సృష్టించిన భాను పోయిన వారం ఎలిమినేట్ కాగా…ఈవారం ఎవ‌రూ ఎలిమినెట్ అవుతార‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈవారం ప్ర‌ముఖ న‌టీ తేజస్వీ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినెట్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఈషోలో పాల్గోన్న ఆడియ‌న్స్ కొంత మంది సోష‌ల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.

tejaswi-madivada

కొంద‌మంది అభిమానులు తేజ‌స్వీతో సెల్ఫీలు తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేసి షీ ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఎలిమినేష‌న్ రేసు లో కౌశ‌ల్, తేజ‌స్వీ ఉన్న విష‌యం తెలిసిందే. ఇక నిన్న జ‌రిగిన ఎపిసోడ్ లో ఒక్క‌క్క‌రూ తాము బిగ్ బాస్ హౌజ్ లోకి ఎందుకు వ‌చ్చామా అనే రిజ‌న్ ను చెప్పారు. తాను డ‌బ్బు కోస‌మే వ‌చ్చాన‌ని…నేను 100రోజుల్లో ఎన్ని సినిమాలు చేసినా రూ.50ల‌క్ష‌ల సంపాదించ‌లేన‌ని చెప్పింది తేజ‌స్వీ. బిగ్ బాస్ హౌజ్ లోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా మందితో క‌నెక్ట్ అయ్యాన‌ని చెప్పింది. ముఖ్యంగా త‌నీష్ లో న‌న్ను నేను చూసుకుంటాన‌ని చెప్పిన విష‌యం తెలిసందే. హౌజ్ లో తేజు ప్ర‌వ‌ర్తించిన తీరు వ‌ల్లే ఎలిమినేట్ అయింద‌ని ప‌లువురు ప్రేక్ష‌కులు చెబుతున్నారు

- Advertisement -