ఫోన్ కొట్టండి..మొక్కలు తీసుకెళ్లండి..

614
Haritha Haram
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా చేప‌ట్టిన ప‌థ‌కం హ‌రిత‌హారం. తెలంగాణ‌ను ఆకుప‌చ్చ తెలంగాణగా మార్చాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌తి ఒక్క‌రు ఒక మొక్క నాటాల‌ని పిలుపునిచ్చారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఈవిధంగా ప‌లు ద‌శ‌లుగా హ‌రిత‌హారం కార్య‌క్రామ‌న్ని నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఈకార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న రావ‌డంతో ఈకార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది. ఇక తాజాగా హరితహారం కార్య‌క్ర‌మంపై జీహెచ్ఎంసీ స‌రికొత్త కార్య‌క్ర‌మానికి తెర‌లేపింది.

kcr

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో విస్తృతంగా మొక్క‌లు నాటేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది జీహెచ్ ఎంసీ. జోన్ల వారిగా మొక్కులు నాటాల‌నుకునే వారు సంప్ర‌దించాల్సిన ఫోన్ నెంబ‌ర్ల‌ను విడుద‌ల చేసింది. ఎవ‌రైనా మొక్క‌ను నాటాల‌నుకున్నారో వారికి దగ్గ‌ర్లో ఉన్న న‌ర్స‌రీ నుంచి ఉచితంగా మొక్క‌లు తీసుకెళ్ల‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో మొత్తం 40ల‌క్ష‌ల మొక్క‌లు నాటేల‌న్నదే త‌మ లక్ష్య‌మ‌న్నారు అధికారులు. అందులో భాగంగా 5ల‌క్ష‌ల మొక్క‌లు రోడ్ల వెంబ‌డి నాట‌గా, మిగిలిన 35ల‌క్ష‌ల మొక్క‌లు ప్ర‌జ‌ల‌కు పంపిణి చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

జోన్ల వారిగా మొక్క‌లు కావాల‌నుకునే వారు ఈక్రింది నెంబ‌ర్లుకు ఫోన్ చేసి మొక్క‌ల‌ను తీసుకెళ్ల‌వ‌చ్చు..

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..

ఎల్బీనగర్ జోన్
ఏబీఎస్‌రావు నగర్ ;8008554905
బండ రవి నర్సరీ ;8008554905
నార్త్ కళ్యాన్‌పురి ;8008554905
బ్యాంక్ కాలనీ ;8008554905
డిఫెన్స్‌కాలనీ నర్సరీ ;8790694053
సచివాలయ నర్సరీ ;8790694053
వనస్థలిపురం నర్సరీ ;8790694053

చార్మినార్ జోన్
సెట్విన్ నర్సరీ ;7673972200
సంతోష్‌నగర్ ;7673972200
మూసీ నర్సరీ ;7673972200
ప్రొ.జయశంకర్‌నర్సరీ-1 ;8790659464
ప్రొ.జయశంకర్‌నర్సరీ-2 ;8790659464
జనచైతన్య నర్సరీ-1 ;8790659464
జనచైతన్య నర్సరీ-2 ;8790659464
పెద్ద తాళ్లకుంట ;8790659464

ఖైరతాబాద్ జోన్
చాచా నెహ్రూ పార్క్ ;7995077951
ఇందిరాపార్క్ నర్సరీ ;8008554903
విజయనర్సరీ ;9989930503

శేరిలింగంపల్లి జోన్
నల్లగండ్ల నర్సరీ ;9100025158
గెజిటెడ్ ఆఫీసర్స్ నర్సరీ ;8790710256
నాగార్జున నర్సరీ ;8790710256
మయూరీనగర్ ;8790710256
హెచ్‌ఎంటీ మక్తా ;8790710256
అన్నమయ్య నర్సరీ ;8790710256

సికింద్రాబాద్ జోన్
ఇందిరాపార్క్ నర్సరీ ;8978780548
డీబీఆర్ నర్సరీ-1 ;9704456428
డీబీఆర్ నర్సరీ-2 ;9704456428
దిల్దార్ నర్సరీ ;9391954257
చందూలాల్ బౌలీ నర్సరీ ;9391954257
సంజీవయ్యపార్క్ నర్సరీ ;9704456428

కూకట్‌పల్లి జోన్
ముళ్లకత్వ నర్సరీ ;9652755188
కుత్బుల్లాపూర్ నర్సరీ ;7032912028
గాజులరామారం నర్సరీ ;7032912028
అల్వాల్ నర్సరీ ;7032912028

- Advertisement -