ఆ హీరో నిజంగానే కంటిచూపు కోల్పోయాడా?

21
- Advertisement -

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తేజ సజ్జ నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ హ‌నుమాన్. ఈ సినిమా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. అయితే, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తేజ సజ్జా కీలక విషయం వెల్లడించాడు. దాదాపు 40 రోజుల పాటు సాగిన క్లైమాక్స్ సన్నివేశంలో ఎక్కువగా దుమ్ము, పొగ రావడంతో తన కంటి చూపు పూర్తిగా దెబ్బ తిందని.. కుడి కన్ను అసలు కనిపించడం లేదన్నాడు. త్వరలోనే కన్నుకు సర్జరీ చేసుకోనున్నట్లు తెలిపాడు. దీంతో ఈ వార్త వైరల్ అయ్యింది. నిజంగానే తేజ సజ్జా కంటి చూపు పోయిందా ?, లేక పబ్లిసిటీ కోసం, సింపతీ కోసం తేజ సజ్జా ఈ కామెంట్స్ చేశాడా ? అని చర్చ మొదలైంది.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, ఓ ఫైట్ లో భాగంగా తేజ సజ్జా కంటికి చిన్న గాయం అయ్యింది. అలాగే అతనికి ఐ సైట్ కూడా ఉందట. ఈ క్రమంలోనే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తేజ సజ్జా చాలా తెలివిగా సినిమా వల్లే తనకు కంటి చూపు పోయింది అని చెప్పి.. సింపతీ కొట్టేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి మూవీ ల‌వ‌ర్స్‌కు చిత్రయూనిట్ శుభవార్త చెప్పింది. ప‌బ్లిక్ నుంచి వ‌స్తున్న భారీ రెస్పాన్స్‌కు ఈరోజు నుంచి హ‌నుమాన్‌ కు అదనపు మార్నింగ్ షోలను క‌లుపుతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

అన్నట్టు.. హనుమాన్ మూవీ నార్త్ లో కూడా అదరగొడుతుంది. మొదటి రోజు ఈ సినిమా 2 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే రెండో రోజు 4.05 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. మూడో రోజు 3.05 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. పైగా ఈ వారంలో కూడా హనుమాన్ సినిమాకి కలెక్షన్స్ స్టడీగా ఉండటం విశేషం. మొత్తమ్మీద యంగ్ హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ విషయాన్ని సాధించారు.

Also Read:ప్రభాస్..రాజా సాబ్

- Advertisement -