- Advertisement -
ఆర్జేడీ నాయకుడు,లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆర్జేడీకి గుడ్ బై చెబుతానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పార్టీలో మా నాన్న అడుగుజాడల్లో నడిచాను… పార్టీలో అందరికీ గౌరవం ఇచ్చాను. త్వరలోనే మా నాన్నను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తాను అని పేర్కొన్నారు.
అయితే తేజ్ ప్రతాప్ కేవలం పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేస్తారా? లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు.
- Advertisement -