బీజేపీకి వ్యతిరేక పవనాలు..

142
- Advertisement -

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉప ఎన్నికలు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో జరగుతున్న ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీ ఘోరపరాజయం దిశగా పయనిచింది.

మొత్తం ఏడు స్థానాల్లో ఆరు స్థానాల్లో నిలిచి మూడింటని కైవసం చేసుకుంది. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తనపట్టు మెల్లగా కొల్పోవడం ప్రారంభించింది.

బీహార్‌లోని  మొకామా అసెంబ్లీ స్థానంలో  ఆర్‌జేడీ అభ్యర్థి అయిన నీలం దేవి విజయం సాధించింది.

ఉత్తరప్రదేశ్‌లో బీహార్‌లోని మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నికలో ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన రుతుజా లట్కే విజయం సాధించి మహారాష్ట్రలో శివసేన పట్టు కోల్పోలేదని నిరూపించింది.

హర్యానాలోని అదంపూర్‌ ఉప ఎన్నికల్లో బిష్ణోయ్ విజయం సాధించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ చిన్న కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆగస్టులో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది. దీంతో బిష్ణోయ్‌ 16,388 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి పై విజయం సాధించారు.

బీహార్‌లోని గోపాల్‌ గంజ్‌ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. గోపాల్‌ గంజ్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆర్జేడీని  స్వల్ప తేడాతో ఓడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోల గోకరనాథ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమన్‌ గిరి తన సమీప అప్రత్యర్థి అయిన సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన అభ్యర్దిపై 34,000ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది ఇంకా అధికారికంగా వెలువడలేదు.

ఇవి కూడా చదవండి..

కారును పోలిన గుర్తులతో టీఆర్‌ఎస్‌కు నష్టం

ఈ తీర్పుతో బీజేపీకి మైండ్‌బ్లాంక్‌:దాసోజు

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియాభట్‌

 

- Advertisement -