బాలికను బలికొన్న ఇన్‌స్టాగ్రామ్‌..!

282
Teenage girl kills herself
- Advertisement -

సోషల్ మీడియా వాడకం ఎంత ఉపయోగమో, అంత ప్రమాదం కూడా ఉంది. దానిని వాడుకునే విధానం బట్టి మంచి చెడులు ఉన్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. ఇంట్లో కొద్దిసేపైనా కుటుంబంతో గడపటానికి సమయం కేటాయించని వాళ్లుకూడా మొబైల్ వాడకానికి గంటల సమయం కేటాయిస్తున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల యువతి,యువకులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా ఈ సోషల్ మీడియా ఓ బాలిక ప్రాణాలు తీసింది.

Teenage girl kills herself

మలేషియాలో 16 ఏళ్ల బాలిక తాను బతకడానికి అర్హురాలినా? కాదా? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘డి, ఎల్‌’ లలో ఏదో ఒకటి ఎంచుకొనేందుకు నాకు సహకరించండి’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో ‘డి’ అంటే డై అని, ‘ఎల్’ అంటే లివ్ అనే అర్థాలు వస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. తాను నిర్వహించిన పోల్ కు వచ్చిన ఫలితం ఆధారంగా ఈ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.

అయితే ఈ అమ్మాయి పెట్టిన పోస్టును చూసిన వారిలో 69 శాతం మంది ‘డి’ ఆప్షన్‌కు ఓటు వేయగా, మిగిలిన 31 శాతం మంది ఎల్ ఆప్షన్‌కు ఓటు వేశారు. దీనిని చూసిన ఆ బాలిక తాను బతికడానికి అర్హురాలిని కాను అని భావించి, భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బాలికతో పాటు ఆమె స్నేహితుల సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో మంచి ఆలోచనలు పంచుకోవడానికి మాత్రమే వినియోగిస్తే సమాజానికి మంచిదని పలువురు సూచిస్తున్నారు.

- Advertisement -