కేసీఆర్‌ కిట్‌లతో పెరిగిన ప్రసవాలు…

639
anitha reddy
- Advertisement -

కేసీఆర్ కిట్ ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని, వీటితోపాటు శిశువుల వ్యాధి నిరోధక టీకాలు తీసుకున్న పిల్లల సంఖ్య కూడా పెరిగిందని రంగారెడ్డి జిల్లా పరిషత్ లో జరిగిన సమావేశంలో వెల్లడించారు.

జడ్పీ ఛైర్మన్ తీగల అనితా రెడ్డి అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశానికి కొత్తూర్ జెడ్పీటీసి స్రీలత, సీఈవో జానకి రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి ఇతరులు హాజరయ్యారు. విద్యా,ఆరోగ్యం, ప్రణాలిక, స్త్రీ,శిశు సంక్షేమమం,ఇంజనీరింగ్ పనుల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో కెసిఆర్ కిట్ ప్రారంభమైన దగ్గర నుండి 51,630మందికి వర్తింప చేసి రూ.12.05కొట్ల ఆర్డిక సహాయాన్ని అందించామని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎనిమిది లక్షల 60వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రెండు లక్షల 52 వేల మందికి అద్దాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనిలో భాగంగా 1338 పాఠశాలలోని 1,44,157 మందికి మద్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు.

ఈ విద్యా సంవత్సరం లో పడవ తరగతి పరీక్షల్లో 100 శాతం వుత్తీర్ణత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. జిల్లా పరిషత్ ఇంజనీరింగు విభాగం ద్వారా జిల్లాలో 523 పనులను రూ.20.92కొట్ల వ్యయం తొ చేపట్టామని, యి పనులు పురోగతిలొ వున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఐ.సీ.డీ.ఎస్ విభాగం ద్వారా 77,141మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తున్నామని, 16,896 మండి గర్భవతులకు పౌస్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. జిల్లాలోమీసాణ కాకతీయ కింద 5 సంవత్సరాల్లో 2033చెరువులనురూ.241.78కొట్ల వ్యయం తొ అభివృద్ది చేయాలనే లక్ష్యాన్ని నిర్డారించగా,ఇప్పటివరకు 4దశలుగా 845 చెరువుల అభివృద్దిని చేపట్టామని పేర్కొన్నారు. మిషన్ భగీరధ పధకం లో భాగంగా రూ.476.50.కోట్లతో రక్షిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుపారు. ఈ సమావేశం లో సంభందిత శాఖల అదికారులు పాల్గొన్నారు.

- Advertisement -