టీమిండియాకు దెబ్బేసిన ఓవర్ కాన్ఫిడెన్స్..!

29
- Advertisement -

140 కోట్ల భారతీయుల ఆశలు ఆవిరయ్యాయి. అద్భుత ఫామ్ లో ఉన్న టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భావించిన ప్రతి అభిమాని కలలు పగటి కలలు గానే మిగిలిపోయాయి. వరల్డ్ కప్ లో తిరుగులేని ఆటతో కప్పు మనదే అనేలా ఆశలు రేపిన రోహిత్ సేన ఫైనల్ లో మాత్రం చేతులెత్తేసింది. అసలు లీగ్ దశలోనే నిష్క్రిమిస్తుందేమో అని భావించిన ఆస్ట్రేలియా అందరి అంచనాలను తలకిందులు చేసి ఆరో సారి కప్పు ఎగరేసుకుపోయింది. లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వచ్చిన టీమిండియాను ఓవర్ కాన్ఫిడెన్సే దెబ్బ తీసిందని మాజీలు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .

జట్టులో అందరూ సమిష్టిగా రాణిస్తున్నందున తమ ముందు ఏ జట్టు నిలబడదని అంచనా వేసిన రోహిత్ సేనకు ఈ పరాజయం గొప్ప గుణపాఠంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 300 పైచిలుకు పరుగులు చేసి వుంటే విజయం టీమిండియా వైపే ఉండేదని, బ్యాటింగ్ లో జట్టు విఫలం అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పటిలాగే ధాటిగా ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 47 పరుగుల ఆచితూచి ఆడాల్సిందని.. అప్పటికే గిల్ వికెట్ కోల్పోయినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో షాట్ కోసం ప్రయత్నించి ఔట్ అయ్యాడని కొందరు చెబుతున్నారు.

ఇక ఆ తరువాత విరాట్ కోహ్లీ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనేది చాలమంది అభిప్రాయం. కే‌ఎల్ రాహుల్ క్రీజ్ లో నిలదొక్కుకున్నప్పటికి గొప్ప ఇన్నింగ్స్ ఆడడంలో విఫలం అయ్యాడని, ఇక టీ20 లలో నెంబర్ ఒన్ బ్యాట్స్ మెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ చెత్త ప్రదర్శన కనబరిచడాని విమర్శిస్తున్నారు. మొత్తానికి అన్నీ విభాగాల్లో టాప్ లో ఉన్న టీమిండియాకు లక్ కలిసి రాకపోవడం వల్లే కప్పు కోల్పోయారని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరేమో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇండియా ఓడిపోయిందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి.

Also Read:Bigg Boss 7:కోట బొమ్మాలితో బిస్ బాస్

- Advertisement -