21న టీమ్-5 వస్తుంది..

248
- Advertisement -

భారత జాతీయ క్రికెట‌ర్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఊపిరి, ప్రేమ‌మ్, మ‌జ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాల‌కు సంగీతం అందించిన గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధ‌మైంది.

దర్శకుడు సురేష్ గోవింద్ మాట్లాడుతూ – ”ఈనెల 21న విడుద‌ల కానున్న మా టీమ్-5 చిత్రం కోసం ప‌ని చేసిన వారికి, మాకు సాయం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థ్యాంక్స్. ఈ సినిమా ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి త‌ప్ప‌కుండా న‌చ్చేలా ఉంటుంది అన్నారు. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీమ్ 5 చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందింది. గోపీసుంద‌ర్ సంగీతం అందించ‌న ఈ చిత్రం యొక్క పాట‌లు మ‌ధుర ఆడియో ద్వారా విడుద‌లై, పాట‌లు బాగా విజ‌య‌వంతం అయ్యాయి” అన్నారు.

Team 5 Movie Release Date

టీమ్ 5 చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ – ”ఈ చిత్రానికి గోపి సుందర్ చక్కటి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో శ్రీశాంత్, నిక్కీ మరియు పర్లీ చాల చక్కగా నటించారు. టీమ్ 5 అనేది ఐదుగురు స్నేహితులు, బైక్ రేసింగ్ పైన నడిచే కథ. ఇందులో నిక్కీ, శ్రీశాంత్ ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. శ్రీశాంత్ కి పర్లీ సోదరి గా నటిస్తుంది. శ్రీశాంత్ ఈ చిత్రంలో తన నటన, డాన్స్ లతో అదరగొట్టాడు. ఈ చిత్రం యువత ని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.” అని అన్నారు.

Team 5 Movie Release Date

హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ- ” ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా మరియు చిత్రం ఇంత బాగా వచ్చేలా సహకరించినందుకు చిత్ర యూనిట్ సభ్యులకి ధన్యవాదాలు. చాల ఓపికగా నాకు సహకరించిన నిర్మాత మరియు టీమ్ కి థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇస్తుంది. నాకు హైదరాబాద్ అంటే చాల ఇష్టం. ఇక్కడి అభిమానులు క్రికెటర్ గా నన్ను బాగా అభిమానించే వారు ఇప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

నటీనటులు : శ్రీశాంత్, నిక్కీ గర్లాని, పర్లీ, మకరంద్ దేశ్ పాండే. రచయిత, దర్శకుడు: సురేష్ గోవింద్, నిర్మాత : రాజ్ జకారియస్, సహ నిర్మాత : అన్సార్ రషీద్, సంగీతం : గోపి సుందర్, ఛాయాగ్రహణం : సాజిత్ పురుషన్, ఎడిటర్ : దిలీప్ డెన్నిస్, ఆర్ట్ డైరెక్టర్ : సాహస బాల, కాస్ట్యూమ్ డిజైనర్: సునీత ప్రశాంత్, స్టిల్స్ : SP ఆరుకట్టు, ప్రొడక్షన్ కంట్రోలర్ : శ్యామ్ ప్రసాద్,పీఆర్వోః గాండ్ల‌ శ్రీనివాస్.

- Advertisement -