టీమ్-5తో ఆకట్టుకోనున్న శ్రీశాంత్

249
- Advertisement -

భారత జాతీయ  క్రికెట‌ర్ గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం  ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీశాంత్ బైక్ రేస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ఊపిరి, ప్రేమ‌మ్, మ‌జ్ను తాజాగా నిన్నుకోరి చిత్రాల‌కు సంగీతం అందించిన గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధ‌మైంది. కాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ ఫంక్షన్‌ జులై 5 న హైదరాబాద్‌ లో చిత్ర ప్రముఖుల మధ్య  జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు దాము, మధుర శ్రీధర్ రెడ్డి, రాజ్ కందుకూరి మరియు దర్శకుడు నవీన్ అతిధులుగా హాజరు అయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాత  రాజ్  జకారియాస్, హీరో శ్రీశాంత్ నిక్కీ గర్లాని, పర్లీ హాజరయ్యారు.

టీమ్ 5 చిత్రం యొక్క ట్రైలర్ ని నిర్మాతలు దాము మరియు రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం యొక్క పాటలు మధుర ఆడియో ద్వారా విడుదలయ్యాయి. చిత్రం యొక్క  మొదటి పాటని దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి చేతుల మీదగా విడుదల చేశారు. రెండవ పాటని దర్శకుడు నవీన్ చేతుల మీదుగా విడుదల చేశారు. జూలై 14న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.

team 5 movie press meet
నిర్మాత దాము మాట్లాడుతూ- “టీమ్ 5 చిత్రం చాల థ్రిల్లింగ్ గా కనిపిస్తుంది. హీరో శ్రీశాంత్ గురించి దేశం మొత్తం తెలుసు. ఆయన లుక్ పరంగా ఈ చిత్రం చేయటం చాల బాగుంది. క్రికెటర్, సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ నటనలోనూ రాణిస్తాడని నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన పర్లీ చాల టాలెంటెడ్ అమ్మాయి. ఇలాంటి చిత్రాన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలనుకోవడం చాల మంచి నిర్ణయం, సరైన సమయంలో సినిమాని విడుదల చేయబోతున్నారు అందరికి అల్ ది బెస్ట్” అని అని అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ” ట్రైలర్ చాల కొత్తగా భిన్నంగా ఉంది. 5 అనే నెంబర్ చాల పాజిటివ్ నెంబర్. పంచాక్షరి, పంచముఖి అలాగే ఇప్పుడు టీమ్ 5. టీమ్ 5 హీరోగా శ్రీశాంత్ కి కలిసొస్తుందని ఆశిస్తున్నా ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో లాగ టీమ్ 5 తో ప్రేక్షకులకి దగ్గరవుతాడని ఆశిస్తున్నా, బేసిక్ గా నేను మలయాళం చిత్రాలని ఎక్కువ ఇష్టపడుతుంటా… చార్లీ, ఓం శాంతి ఓశానా మరియు బెంగళూర్ డేస్ వంటి చిత్రాలు నాకు చాల ఇష్టం. ఈ సినిమా నిర్మాత రాజ్ గారికి మంచి వసూళ్లు తప్పకుండా లభిస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే నా పేరు కూడా రాజ్ కాబట్టి ( నవ్వుకుంటూ) ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి నమ్మాలి. ఈనెల 14 న విడుదల అవబోతున్న ఈ చిత్రానికి అల్ ది బెస్ట్” అని అన్నారు.

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ” ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం  అనే ప్రాంతీయ భేదం లేకుండా ఇండియన్ మూవీ గా తెరకెక్కబడింది. గతంలో పెళ్లి చూపులు సినిమా ఒక భాషలో విడుదల అయ్యి తర్వాత అన్ని భాషల్లో విడుదలయినట్టుగానే ఈ చిత్రం ఆడాలని కోరుకుంటున్నా. ఇలాంటి చిత్రాలని తెలుగులో విడుదల చేయటానికి నేను ఎప్పుడైనా సహకరిస్తాను. ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున్న రిలీజ్ చేసి, మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ప్రయత్నిస్తాను. ఈనెల 14 న విడుదలవుతున్న ఈ చిత్రంతో శ్రీశాంత్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

team 5 movie press meet

దర్శకుడు నవీన్ మాట్లాడుతూ – ” ఈనెల 14  విడుదల కాబోతున్న టీమ్ 5 చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్. నాకు మొదట తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు తెలియదు ఆ సమయంలో నేను మధుర శ్రీధర్ గారి దగ్గరకి వెళ్లి, ఎలా నా సినిమాని విడుదల చేయాలి అంటే.. అయన చాల హెల్ప్ చేశారు. అలాగే రాజ్ కందుకూరి గారు నా రెండు సినిమాలు ఓపిగ్గా చూసి మంచి అడ్వైజ్ ఇచ్చారు. మధుర శ్రీధర్, రాజ్ కందుకూరి సహరిస్తున్న టీమ్ 5 చిత్రానికి అల్ ది బెస్ట్” అని అన్నారు.

టీమ్ 5 చిత్ర నిర్మాత రాజ్  జకారియాస్ మాట్లాడుతూ – ” ఈ కార్యక్రమానికి వచ్చిన రాము గారికి, రాజ్ కందుకూరి గారికి మరియు నవీన్ గారికి థాంక్స్. అలాగే మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మధుర శ్రీధర్ గారికి థాంక్స్. ఈ చిత్రానికి గోపి సుందర్ చక్కటి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో శ్రీశాంత్, నిక్కీ మరియు పర్లీ చాల చక్కగా నటించారు. టీమ్ 5 అనేది ఐదుగురు స్నేహితులు, బైక్ రేసింగ్ పైన నడిచే కథ. ఇందులో నిక్కీ, శ్రీశాంత్ ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. శ్రీశాంత్ కి పర్లీ సోదరి గా నటిస్తుంది. శ్రీశాంత్ ఈ చిత్రంలో తన నటన, డాన్స్ లతో అదరగొట్టాడు. ఈ చిత్రం యువత ని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.” అని అన్నారు.

హీరోయిన్ నిక్కీ మాట్లాడుతూ – టీమ్ 5 అనేది ఐదుగురు అబ్బాయి మధ్య జరిగే కథ. ఆ ఐదుగురిలో ఒకడైన శ్రీశాంత్  వారిని లీడ్ చేస్తూ ఉంటాడు. పర్లీ-శ్రీశాంత్ ల మధ్య అన్నచెల్లల బంధం చాల బాగుంటుంది. అందరూ అడ్వెంచర్ అన్నట్టూ అడ్వెంచర్ తోపాటు ఈ చిత్రంలో మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామా ఉంటుంది. దర్శకుడు సురేష్ గోవింద్ చాల బాగా తెరకెక్కించారు. గోపి సుందర్ చక్కని సంగీతం అందించారు. నేను స్కూల్ దశలో ఉన్నప్పటినుండే క్రికెటర్ గా శ్రీశాంత్ తెలుసు. నేను ఇలా హీరోయిన్ అయ్యి శ్రీశాంత్ తో సినిమా చేస్తానని ఎపుడు అనుకోలేదు. నాకు మొదట ఫోన్ వచ్చి శ్రీశాంత్ తో సినిమా అనగానే నేను షాక్ అయ్యాను. శ్రీశాంత్ క్రికెటర్ గా ఎలా ఆకట్టుకున్నాడో.. హీరోగా అందరిని అలాగే ఆకట్టుకుంటాడు. నిర్మాత రాజ్ ఎల్లప్పుడూ దగ్గరుండి ఎలాంటి లోటు లేకుండా షూటింగ్ పూర్తి చేశారని ఆయనకి పెద్ద థాంక్స్.” అని అన్నారు.

సహా నటి పర్లీ మాట్లాడుతూ – ” ఈ కార్యక్రమానికి వచ్చిన దాము సార్ కి చాల థాంక్స్. నాగురించి పాజిటివ్ గా అయన మాట్లాడటం సంతోషంగా ఉంది. నాకు తెలుగులో ఇది రెండవ మూవీ, మొదటి సినిమా కల్యాణ వైభోగమే. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత రాజ్ గారికి థాంక్స్. ఈ చిత్రం బైక్ రేసింగ్ అనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న చిత్రం. ఈ చిత్రంలో శ్రీశాంత్, నిక్కీ చాల బాగా నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాను.” అని అన్నారు.

team 5 movie press meet
హీరో శ్రీశాంత్ మాట్లాడుతూ- ” ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా మరియు చిత్రం ఇంత బాగా వచ్చేలా సహకరించినందుకు చిత్ర యూనిట్ సభ్యులకి ధన్యవాదాలు. దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్న మధుర శ్రీధర్ గారికి థాంక్స్. నావల్ల ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎక్కువ సమయం పట్టింది. చాల ఓపికగా నాకు సహకరించిన నిర్మాత మరియు టీమ్ కి థాంక్స్. రాజ్ కందుకూరి గారు చెప్పినట్టుగా 5 నా లక్కీ నెంబర్. నేషనల్ అవార్డు పొందినందుకు రాజ్ గారికి కంగ్రాట్స్. నిక్కీ, పర్లీ తో నటించటం చాల ఆనందంగాఉంది. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి మెసేజ్ ఇస్తుంది. నాకు హైదరాబాద్ అంటే చాల ఇష్టం. ఇక్కడి అభిమానులు క్రికెటర్ గా నన్ను బాగా అభిమానించే వారు ఇప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.” అని అన్నారు.

నటీనటులు : శ్రీశాంత్, నిక్కీ గర్లాని, పర్లీ, మకరంద్ దేశ్ పాండే,రచయిత, దర్శకుడు: సురేష్ గోవింద్, నిర్మాత : రాజ్ జకారియస్, సహ నిర్మాత : అన్సార్ రషీద్, సంగీతం : గోపి సుందర్, ఛాయాగ్రహణం : సాజిత్ పురుషన్, ఎడిటర్ : దిలీప్ డెన్నిస్, ఆర్ట్ డైరెక్టర్ : సాహస బాల, కాస్ట్యూమ్ డిజైనర్: సునీత ప్రశాంత్, స్టిల్స్ : SP ఆరుకట్టు, ప్రొడక్షన్ కంట్రోలర్ : శ్యామ్ ప్రసాద్,పీఆర్వో  : గండ్ల శ్రీనివాస్.

- Advertisement -