వైసీపీలోకి వల్లభనేని వంశీ..ముహుర్తం ఖరారు

420
Vallabhaneni Vamshi
- Advertisement -

కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటివలే టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పంపించారు. చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి. కానీ, టీడీపీలో కొనసాగేందుకు వంశీ సుముఖత చూపలేదు. మరోవైపు వంశీని బుబ్జగించేందుకు టీడీపీ కీలక నేతలు ఆయనతో సమావేశమైన ఫలితం లేకుండా పోయింది.

వంశీ రాజకీయాలకు గుడ్ చెబుతాడన్న వార్తలు వెలువడగా తాజాగా మరో వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వంశీ వైసీపీ చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈనెల 3న తేదా 4వ తేదిన జగన్ సమక్షంలో వైసీపీ చేరనున్నట్లు ప్రకటించారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో గన్నవరం వైసీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -