అధికారంలోకి వచ్చినా పనులు కావట్లేదు:టీడీపీ ఎమ్మెల్యే

4
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాం..అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇసుక, మద్యం వైసీపీ మాఫియా చేతుల్లోనే ఉందని… ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారు అన్నారు.

ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం… టీడీపీ శ్రేణుల పరిస్థితి మరీ విచిత్రంగా మారిందన్నారు. కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు కానీ అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ చేసిన కామెంట్స్ స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Also read:ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్‌కమిటీ

- Advertisement -