ఎన్టీఆర్ అంటే పేరు కాదు తెలుగుజాతి వెన్నెముక: బాలకృష్ణ

74
balaiah
- Advertisement -

ఏపీ ప్రభుత్వం తీసుకున్న పేరుమార్పుపై ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఇటీవలే అసెంబ్లీ బిల్లు తెచ్చి అమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చిన నేపథ్యంలో బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని ఆరోపించారు. పేరు మార్చడానికి, తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. తెలుగుజాతికి వెన్నెముక అని పేర్కొన్నారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని హెచ్చరించారు. పంచభూతాలున్నాయి తస్మాత్‌ జాగ్రత్త అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా వార్నింగ్‌ ఇచ్చారు. మహానీయుడు ఎన్టీఆర్‌ పెట్టిన భిక్షతో రాజకీయ జీవితం గడుపుతున్న కొంతమంది వ్యక్తులు వైసీపీలో ఉన్నారన్నారు.
విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని బాలయ్య కామెంట్‌ చేశారు.

- Advertisement -