ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మద్య పొత్తుపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన తరువాత పొత్తు కన్ఫర్మ్ అయింది. ఇక పొత్తుపై క్లారిటీ వచ్చినది మొదలు కొని ఈ రెండు రెండు పార్టీలు ఎలా ముందుకు వెళ్లబోతున్నాయి ? సీట్ల సర్దుబాటు టీడీపీ జనసేన మద్య ఎలా ఉండబోతుంది? మేనిఫెస్టో పై రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ఉంటాయా ? అసలు ఈ రెండు పార్టీల ఉమ్మడి సిఎం అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలు గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఫ్యూచర్ ప్లాన్స్ పై గట్టిగా దృష్టి సారిస్తున్నారు రెండు పార్టీల ఆగ్రనేతలు. ఆ మద్య రెండు పార్టీల బలోపేతం కోసం జనసేన సమన్వయ కమిటీల ఏర్పాటు చక చక అడుగులు పడ్డాయి. టీడీపీ కూడా సమన్వయ కమిటీ ఏర్పాటుకు వడివడిగానే అడుగులు వేసింది. ఇక తాజాగా సమన్వయ కమిటీల నియామకం దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున కమిటీలో ఉండే విధంగా ప్రతిపాదనలు జరిగాయట. జనసేనకు నాదెండ్ల మనోహర్, టీడీపీకి యనమల రామకృష్ణుడు.. నేతృత్వం వచించే అవకాశాలు ఉన్నాయి.
మరో రెండు రోజుల్లో కమిటీలపై పూర్తి స్పష్టత రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కమిటీల ద్వారానే సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో తదితర అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సీట్ల విషయంలో ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లను జనసేన డిమాండ్ చేస్తునట్లు వినికిడి. అందుకు టీడీపీ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సిఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగిస్తూ.. ఎన్నికలు పూర్తి అయిన తరువాత రిజల్ట్స్ ను బట్టి సిఎం ను ఎరవనేది ఎల్చుకోవాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయట. మొత్తానికి టీడీపీ జనసేన కూటమి విషయంలో ఫ్యూచర్ ప్లాన్స్ పై గట్టిగానే దృష్టి పెట్టారు అధినేతలు.
Also Read:క్లాస్, మాస్‌ని మెప్పించిన మారుతి..