వరుస భేటీలు.. కాంగ్రెస్ తేల్చేడెప్పుడు?

27
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ లో నెలకొన్న కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులన్ ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శరవేగంగా సిద్దమౌతోంది. కానీ హస్తం పార్టీ మాత్రం లొసుగులను సరిద్దడం లోనే సమయాన్ని గడిపేస్తోంది. బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోతోంది. అభ్యర్థుల ఎంపికలో స్క్రినింగ్ కమిటీ ఇప్పటికే చాలాసార్లు సమావేశం అయినప్పటికి ఎంపిక మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. దీనికి ప్రధాన కారణం నియోజిక వర్గాల వారీగా ఆశావాహుల నుంచి భారీగా టికెట్లు రావడం ఒక కారణమైతే.. స్క్రినింగ్ కమిటీ సభ్యులలో ఏకాభిప్రాయం లేకపోవడం మరో కారణం. .

గత నెల 21,22 తేదీల్లో స్క్రినింగ్ కమిటీలోని సభ్యులు సమావేశం అయి 40 స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని 35 స్థానాల్లో ఇద్దరిద్దరి చొప్పున ఎంపిక చేశారట. అయితే ఎంపిక చేసిన వారిపై మళ్ళీ ఏకాభిప్రాయం కొరత ఏర్పడి.. పునః పరిశీలన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరోసారి నేడు స్క్రినింగ్ కమిటీ సమావేశం కానుంది. కమిటీలోని సభ్యులు రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు నేడు డిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

ఇక ఈ నెల 10లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే అభ్యర్థుల ఎంపికను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని హస్తం పార్టీ అగ్రనేతలు బావిస్తున్నారట. పార్టీలోని ఆశావాహులు చాలమంది ఇప్పటికే డిల్లీకి మకాం మార్చారు. స్కినింగ్ కమిటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపికలో ఏమాత్రం అన్యాయం జరిగిన డిల్లీ అగ్రనాయకత్వాన్ని కాకాపట్టేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవేళ ఆశావాహులు ఆశిస్తున్నట్లుగా టికెట్ల కేటాయింపు జరగకపోతే హస్తం పార్టీలో అల్లకల్లోలం ఏర్పడడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:క్లాస్, మాస్‌ని మెప్పించిన మారుతి..

- Advertisement -