టీడీపీ, బీజేపీ అంతర్గత పొత్తు?

40
- Advertisement -

ఏపీలో టీడీపీ బీజేపీ మద్య పొత్తు వ్యవహారంపై రోజుకో కొత్త వాదన తెరపైకి వస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మద్య కూటమి ఏర్పడుతుందని వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆ మద్య వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ ఏ4వారు ఊహించని విధంగా టీడీపీ అధినేత స్కిల్ స్కామ్ లో జైలుపాలు కావడంతో పొత్తు అంశం డైలమాలో పడింది. కానీ జనసేన పార్టీ మాత్రం హటాత్తుగా టీడీపీతో పొత్తు ప్రకటించి బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ దూరంగా ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర హస్తం కూడా ఉందనే వార్తలు రావడంతో టీడీపీకి బీజేపీకి దూరం పెరిగిందనే వార్తలకు బలం ఏర్పడింది. .

ఇదిలా ఉంచితే అమరావతి రింగ్ రోడ్ స్కామ్ లో నారా లోకేశ్ గత రెండు రోజులుగా విచారణ ఎదుర్కొన్నా సంగతి తెలిసిందే. కాగా ఆయన ఇవాళ డిల్లీ వెళ్లారు. డిల్లీలో అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా రెండు రాష్ట్ర రాజకీయలు వేడెక్కాయి. ఈ సమావేశాన్ని బట్టి చూస్తే టీడీపీ బీజేపీ మద్య సయోద్య కుదిరిందనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా టీడీపీతో జట్టు కట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఈ సమావేశాన్ని బట్టి అర్థమౌతోందనేది కొందరి అభిప్రాయం. నిజంగానే ఈ రెండు పార్టీల మద్య పొత్తు కన్ఫర్మ్ అయితే ప్రస్తుతం టీడీపీని వేధిస్తున్న స్కామ్ అంశాలన్నీ పటాపంచలు అయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తానికి తాజా పరిణామాలు చూస్తే టీడీపీ బీజేపీకి మద్య అంతర్గత పొత్తుకు మార్గం ఏర్పడినట్లే తెలుస్తోంది.

Also Read:వయసు చెప్పేసి సిగ్గుపడిన అనసూయ

- Advertisement -