చామదుంప తింటే ఎన్ని ప్రయోజనాలో..!

74
- Advertisement -

మనం నిత్యం తినే కూరగాయల్లో దుంపలను కూడా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా బంగాళదుంప, చిలకడదుంప.. వంటివి ఎక్కువగా మనం తినే ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాము. అయితే ఇదే దుంప జాతికి చెందిన చామదుంప ను మాత్రం చాలమంది తినడానికి ఇష్టపడరు. కానీ కొందరు మాత్రం దీనిని ఫ్ర్రై రూపంలో లేదా కర్రీ రూపంలో చేసుకొని ఆరగిస్తుంటారు. అయితే ఈ చామదుంప తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ప్రతిఒక్కరూ కూడా తింటారని ఆహార నిపుణులు చెబుతున్నారు. చామదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. .

ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగేందుకు, రక్తకణాల వృద్దికి కూడా ఈ చాయదుంపలోని పోషకాలు ఉపయోగ పడతాయట. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు తప్పనిసరిగా ఈ చాయదుంపను తినే ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. తద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో విటమిన్ ఏ, బి1 , బి2, బి3, బి5, బి6, విటమిన్ సి, వంటి వాటితో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవే. ఇక ఈ చామదుంప ను ఆహారంగా చేర్చుకోవడం వల్ల చలికాలంలో వేధించే కీళ్ల నొప్పులు కూడా దూరమవుతాయని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల పటుత్వం కూడా బలపడుతుంది. ఇంకా హార్మోన్ల అసమతుల్యతను దూరం చేయడంలోనూ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలోనూ చామదుంప ఎంతగానో సహాయ పడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR:ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు

- Advertisement -