తాప్సి..తెగ ఫీలైపోతోంది..

146
tapsee upset with national awards

అప్పుడు ఎగిరి గంతేసిన తాప్సి ఇప్పుడు తెగ ఫీలైపోతోంది. కాస్త కదిపితే చాలు మనసులో మాటని మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. ఇంతకీ తాప్సికి ఏమైంది..? అప్పుడెందుకు గంతులేసింది, ఇప్పుడెందుకు తెగ ఫీలైపోతోంది..అనుకుంటున్నారా? అంతా సిని అవార్డుల మహిమే. ఎన్ని సినిమాలు చేసినా తనకి సరైన గుర్తింపు రావడంలేదని వాపోతోంది తాప్సి.
tapsee upset with national awards
దీంతో తన మనసుకి ఏదనిపిస్తే..అదే బయటపెట్టేస్తుంది. అయితే..’పింక్‌’  సినిమాలో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది తాప్సీ. ఆ సినిమా పై ప్రశంసల జల్లు కులవడం, అవార్డులు వెల్లువలా వచ్చిపడ్డంతో..తనకి నిజమైన గుర్తింపు ఇప్పుడే వచ్చిందంటూ తెగ మురిసిపోయింది. కానీ..తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులు మాత్రం ఈ భామకు నిరాశనే మిగిల్చాయని చెప్పుకోవాలి. ‘పింక్‌’ చిత్రానికి అవార్డు దక్కినప్పటికీ.. ఉత్తమ నటి అవార్డు మాత్రం తనకి దక్కలేదంటూ..ఫీలవుతోంది.
 tapsee upset with national awards
అంతేకాకుండా సౌత్‌ సినిమాల్లో హీరోయిన్లకు గుర్తింపు వుండదనీ, ఎక్స్‌పోజింగ్‌ తప్ప నటనకు ఛాన్స్‌ వుండదనీ అంటోంది. ఇక అవార్డులు రాకపోవడం తనకు కొత్త కాదు కాబట్టి తానేం ఫీలవ్వడం లేదని, అయినా..సౌత్‌లో గ్రూపులు కడితేనే అవార్డలు దక్కుతాయని, ఇదే వాస్తవమని చెప్పుకొచ్చింది తాప్సీ.