సమంతని ఏం చేశారు..?

193
Samantha's look secret in sukumar new movie

సుకుమార్‌ సినిమాలంటేనే కొత్త కాన్సెప్ట్‌ లతో  క్రేజీ ఫీలింగ్ప్‌ని తెప్పిస్తాయి. ఆయన ఏది చేసినా డిఫెరెంట్‌ గానే ఉంటుంది. అయితే  ఇప్పుడు    కూడా సుక్కు డిఫెరెంట్‌ గానే ఆలోచిస్తున్నాడు. దాంతో పాటు సీక్రెట్స్‌ కూడా మెయింటెన్‌ చేస్తున్నాడు.  రామ్‌ చరణ్‌- సుకుమార్‌ కాంబినేషన్‌ లో త్వరలో సినిమా రాబోతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ న్యూ లుక్ తో మిస్మరైజ్ చేస్తాడని టాక్‌. ఇక ఆ లుక్‌ అందరికీ తెలిసిపోయింది.

Samantha's look secret in sukumar new movie
కానీ ఇదే సినిమాలో సమంత  నటిస్తుందన్న విషయం కూడా తెలిసిందే. చరణ్‌ లుక్‌ ని  సీక్రెట్‌ గా ఉంచని సుకుమార్‌ సమంత విషయంలో చాలా సీక్రెట్‌ మెయింటెన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత డీ గ్లామరైజ్డ్‌ గెటప్‌లో మేకప్‌ లేకుండా పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుందని తెలుస్తోంది. అచ్చమైన రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో టెక్నాలజీ మనుషుల్ని శాసించని కాలంలో సెటప్‌ చేసిన ఈ చిత్రంలో ప్రేమని చాలా పవిత్రంగా, అద్భుతంగా సుకుమార్‌ చూపిస్తున్నాడట.దీంతో అందరిలోనూ..సమంత లుక్ ఎలా ఉండబోంతోందనే ఆతృత మొదలైంది.

 ఇక సుకుమార్‌ కూడా సామ్‌ లుక్ ని అంత సీక్రెట్ గా ఉంచడానికి   కారణం ఆడియెన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకోవడమేనని టాక్‌. ఇక ఈసినిమాలో వినోదానికి లోటు వుండదని, సినిమా అంతటా కామెడీ వుంటుందని, ఆర్య కంటే ఎంటర్‌టైనింగ్‌ గా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుందని సమాచారం.
Samantha's look secret in sukumar new movie
ఇందులో సమంత క్యారెక్టర్‌ చాలా ఛాలెంజింగ్‌గా వుంటుందని, నటిగా ఆమెకి చాలా పేరు తెచ్చిపెట్టేలా ఆ క్యారెక్ట్రర్‌ ఉంటుందట. ఇక సమంత కూడా ఈ పాత్ర గురించి చాలా ఎక్సయిట్‌ అవుతున్నప్పటికీ ఏ కొంచెం రివీల్‌ చేసినా ఎక్కడా సీక్రెట్‌ బయటకి పడిపోతుందోనని సైలెంట్‌గా వుండిపోతోందట. మొత్తానికి సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు సమంత లుక్‌ ని సుకుమార్‌ ఎంతవరకు సీక్రెట్‌ గా ఉంచుతాడో చూడాలి.