ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘పెళ్లి కథ’..

163
Pelli Katha Movie Complete First Schedule

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా ‘పెళ్లి కథ’. నూతన తారలు మనోహార్, ఇషిక, అయేషా జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఓ యూత్ ఫుల్ అండం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జి.యన్.మూర్తి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా మొదటి షెడ్యల్ పూర్తి చేసకున్న ఈ చిత్ర బృందం ఏప్రిల్ 14 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. వైజాగా తో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో దశ షూటింగ్ నిర్విహించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్ లో 50 శాతానికి పైగా షూటింగ్ జరిగిందని, సెకండ్ షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూట్ చేసి సాధ్యమైనంత త్వరాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నటు నిర్మాత రామాంజనేయులు తెలిపారు.

Pelli Katha Movie Complete First Schedule