బిగ్ బాస్ లోకి తాప్సి

283
Tapsee In Bigg Boss telugu Show
- Advertisement -

సాధారణంగా ఏదైనా ఛానల్లో ఒక షో పాప్యులర్ అయిందంటే, ఆ షో ద్వారా తమ సినిమాలను ప్రచారం చేసుకోవడమనే కల్చర్ మనకి బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కల్చర్ టాలీవుడ్ ను కూడా ప్రభావితం చేసినట్టుగా అనిపిస్తోంది. ‘స్టార్ మా’లో ప్రసారమవుతోన్న’బిగ్ బాస్’ షోకి రేటింగ్ పెరుగుతూ పోతోంది. దాంతో ఈ షో ద్వారా తమ సినిమాలను ప్రచారం చేసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు.

ఈ వారాంతంలో.. గ్లామర్ హీరోయిన్ తాప్సి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. దెయ్యం గెటప్ లో కనిపించనున్న తాప్సి పనిలోపనిగా తన సినిమా ‘ఆనందో బ్రహ్మ’ ప్రమోషన్ ని కూడా కానిచ్చుకుంటోంది. నిజానికి ‘సినిమా ప్రమోషన్స్’ అనేది బిగ్ బాస్ ఒరిజినల్ కాన్సెప్ట్ లో లేదు.ప్రోగ్రాంకి కమర్షియల్ వ్యాల్యూని పెంచుకోవడం కోసం నిర్వాహకులు ఈ ప్రయోగానికి తెరతీశారు. ఇప్పటికే ఈ షోద్వారా హీరో రానా తాను నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాను ప్రమోట్‌ చేసుకున్నాడు.

ఇప్పుడు తాప్సి కూడా తను నటించిన ఆనందో బ్రహ్మో సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. ఈరోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

- Advertisement -