మంచు మనోజ్ హీరోగా 2010లో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ తాప్సీ.. రాఘవేంద్ర రావు తన సినిమాల్లో సహజంగానే హీరోయిన్ల బొడ్డుపై పండ్లు వేసే సన్నివేశాలను పెడుతుంటారు. ఝుమ్మందినాదం సినిమాలోనూ తాప్సీ బొడ్డుపై పండ్లు వేసే సన్నివేశంపై ఆమె విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాప్సీ చేసిన కామెంట్స్ తో తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు ప్రేక్షకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు . ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, డైరెక్టర్లు వైవీఎస్ చౌదరి, నందినీ రెడ్డి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలను తాప్సీ సమర్థించుకుంటుంది.
శరీరంలోని నడుము వెనక భాగంపై కొబ్బరికాయతో కొట్టడం వల్ల కలిగే శృంగారపరమైన ఉద్వేగాలు ఏముంటాయే ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయానంది తాప్సీ.. హీరోయిన్ల నాభి ప్రాంతంపై పూలు, పండ్లతో కొట్టే రాఘవేంద్రరావు గారు అందులో ఏం రొమాన్స్ చూపించాలనుకున్నాడో నాకు అర్ధం కాలేదని , అదే నేను చెప్పాను తప్ప ఏం తప్పుగా మాట్లాడానని ఎదురు ప్రశ్నిస్తుంది తాప్సీ. నేను మాట్లాడింది రాఘవేంద్రరావు స్టైల్ గురించి, అందులో తప్పేమి లేదు. ఇది మీరు తప్పుగా భావిస్తే అది మీ సమస్య.. నేను మాట్లాడిన వీడియోని ఆయన కుటుంబంతో కలిసి చూశారు.నేను మరోసారి చూశాను. తరువాత ఇద్దరం మాట్లాడుకొని నవ్వుకున్నాం. నేను ఏమి మాట్లాడానో రాఘవేంద్రరావు గారికి తెలుసు. మేం ఇద్దరం బాగానే ఉన్నాం. కొందరు కావాలనే నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వారిని పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
చాలా గ్యాప్ తర్వాత తాప్సీ నటించిన సౌత్ చిత్రం ఆనందో బ్రహ్మ ఆగష్టు 18 న థియేటర్స్ లోకి రానుంది. ఆమె ప్రస్తుతం ‘ఆనందోబ్రహ్మ’ అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే విడుదలకి సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ఎవరూ చూడరాదని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పాస్ అవుతున్నాయి. ఆ చిత్రానికి తన పారితోషికం అందుకున్న తాప్సీకి దీని వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ నోటికొచ్చిన వాగుడుతో అనవసరంగా వివాదాన్ని లేపి తమ సినిమాని చిక్కుల్లో పడేసిందని ఆ సినిమా మేకర్స్ గగ్గోలు పెడుతున్నారు.