సినిమాను బతికించండి..!

104
- Advertisement -

కరోనా, టికెట్ రేట్ల పెంపుతో ప్రజలు సినిమాల థియేటర్లకు వస్తారా లేదా అన్న సందేహాలకు సీతారామం, బింబిసార పుల్ స్టాప్ పెట్టాయి. సినిమా బాగుంటే ప్రజలు ఆదరిస్తారన్న దానికి ఈ రెండు సినిమాలు చిన్న ఉదాహరణ.

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. సీతారామం మంచి ఫీల్ గుడ్ మూవీ అని అని తెలిపిన తమ్మారెడ్డి…ఇక బింబిసార మూవీపై ప్రశంసలు గుప్పించారు.

ఈ మూవీ రెగ్యులర్‌ కమర్షియల్‌ కథే. కాకపోతే కథలో కొత్తదనం కోసం బింబిసారుడు అనే రాజుని తీసుకొచ్చి, అతను ఇప్పుడు ఉంటే ఎలా ఉంటాడు అనే కాన్సెప్ట్ ని జత చేసి కమర్షియల్ సినిమాలా తెరకెక్కించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీసి మంచి విజయం సాధించాడు. ఈ సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ కూడా వచ్చాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకుండా థియేటర్ కి రెగ్యులర్‌ ఆడియన్స్‌ పెరిగేలా చూడాలన్నారు. అలాగే ఇలాంటి సినిమాలను ఆదరించి బతికించాలని ప్రజలను కోరారు.

- Advertisement -