బింబిసార-2.. ఎప్పుడంటే

15
- Advertisement -

గతేడాది ఆగస్టులో విడుదలై కమర్షియల్ హిట్‌గా నిలిచిన బింబిసార సినిమాకు త్వరలో ప్రిక్వెల్ ఉంటుందని నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఉంటుందని అన్నారు. తాజాగా అమిగోస్‌ ప్రమోషన్‌లో భాగంగా విలేఖరులతో మాట్లాడిన కళ్యాణ్‌రామ్‌ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బింబిసార సినిమా కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇది కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్‌ ఈ సినిమాకు ప్రీక్వెల్‌ రూపొందించే పనిలో ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కళ్యాణ్‌రామ్‌ వెల్లడించాడు.

బింబిసార-2 షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని కళ్యాణ్‌రామ్‌ తెలిపాడు. సెకండ్‌ పార్ట్‌లో అస‌లు బింబిసార ఎవ‌రు. బింబిసార త‌న త‌మ్ముడుని ఎందుకు చంపాలి అని అనుకున్నారు. బింబిసార విల‌న్‌గా మార‌డానికి కార‌ణం ఏంటి. త‌న జీవితం చిన్నప్పటి నుండి ఎలా సాగింది అనేది కథాంశతో ఈ ప్రీక్వెల్‌ రూపొందిస్తున్నామని అన్నారు. కాకపోతే ఈ సారి మరింత విజువ‌ల్‌ వండర్‌గా తెరకెక్కించాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి…

రవీంద్ర కౌశిక్‌…ది బ్లాక్ టైగర్‌ బయోపిక్

శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్‌ బయోగ్రఫీ

లియోలో టాలీవుడ్ టాప్ హీరో..!

- Advertisement -