సెంచరీ మార్క్ దాటిన టీవీకే!

4
- Advertisement -

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ పార్టీ ఏకంగా 103 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్, ద్రవిడ దిగ్గజాలైన DMK మరియు AIADMK లను వెనక్కి నెట్టి ‘చెన్నై సూపర్ కింగ్’గా అవతరించారు.అధికారంలో ఉన్న ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని DMK కూటమి ఊహించని విధంగా మూడో స్థానానికి పడిపోయింది.

టీవీల్లో విజయ్ 100 మార్కును దాటినట్లు వార్తలు రావడంతో, తమిళనాడు వ్యాప్తంగా TVK కార్యకర్తలు, అభిమానులు ‘విజిల్ పోడు’ (విజిల్ వేయండి) అంటూ రోడ్లపైకి వచ్చి డ్యాన్సులతో సంబరాలు చేసుకుంటున్నారు.ఎటువంటి భారీ కూటములు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి 100కు పైగా సీట్లలో ఆధిక్యం సాధించడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన విషయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే, విజయ్ స్వయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ (118) కు కొద్దిగా దూరంలో ఆగిపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిదో నిర్ణయించే శక్తిగా విజయ్ నిలవనున్నారు.

తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, దానికి విజయ్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం దొరికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -