దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య పోరు చావో రేవో అన్నట్లుగా సాగుతోంది. అయితే, తొలి కొన్ని గంటల ఫలితాల ట్రెండ్స్ పరిశీలిస్తే బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ (148) ను దాటిపోయింది. బెంగాల్‌లో తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకునే దిశగా కమలం పార్టీ దూసుకుపోతోంది.
మమతా బెనర్జీ వెనుకంజ: అందరి దృష్టి ఉన్న భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్యంగా వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండటం టీఎంసీ శ్రేణులను ఆందోళనలో పడేసింది.
నందిగ్రామ్‌లో ఉత్కంఠ: నందిగ్రామ్‌లో సువేందు అధికారి తన పట్టును నిరూపించుకుంటూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.గతంలో టీఎంసీకి కంచుకోటలుగా ఉన్న గ్రామీణ బెంగాల్ మరియు ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తోంది.
గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కాంగ్రెస్ మరియు వామపక్ష కూటమి నామమాత్రపు స్థానాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ బెంగాల్‌లో బలమైన శక్తిగా ఎదిగింది. గత రాత్రే మమతా బెనర్జీ తన నివాసాన్ని ఖాళీ చేశారన్న వార్తల నేపథ్యంలో, ప్రస్తుత ఫలితాలు బెంగాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంకేతాలు ఇస్తున్నాయి.
Also Read:‘జెట్లీ’..ఎంజాయ్ చేస్తున్నారు!

