మా ఆటతీరు ఇంకా మెరుగుపర్చుకోవాలి!

5
- Advertisement -

గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఇంకా తన అత్యుత్తమ క్రికెట్‌ను ప్రదర్శించాల్సి ఉందని, అయినప్పటికీ విజయాలు సాధిస్తూ ప్లే-ఆఫ్ రేసులో నిలవడం సంతోషకరమని ఆ జట్టు ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హోల్డర్, మ్యాచ్ అనంతరం మాట్లాడారు.

మా జట్టులో ఎవరూ ఒక్కరే ప్రతిరోజూ రాణించడం లేదు. ప్రతి మ్యాచ్‌లో ఒక్కో కొత్త ఆటగాడు బాధ్యత తీసుకుని జట్టును గెలిపిస్తున్నారు. ఇది జట్టుకు చాలా మంచి పరిణామం అని హోల్డర్ అన్నారు.నిజం చెప్పాలంటే, మేము ఇంకా మా అత్యుత్తమ ఆటను (Best Game) ఆడలేదని నేను అనుకుంటున్నాను. కానీ, ఆ లోటు ఉన్నప్పటికీ మైదానంలోకి దిగిన ప్రతిసారీ అవసరమైన రెండు పాయింట్లు సాధించడమే ఇక్కడున్న అసలైన అందం అని ఆయన పేర్కొన్నారు.

164 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతి వరకు ఆడి ఛేదించడంపై స్పందిస్తూ.. నెట్ రన్-రేట్ గురించి ఆలోచించడం కంటే, ప్రస్తుతం వరుసగా మూడో విజయం సాధించి మొమెంటంను కొనసాగించడమే తమ ప్రాధాన్యత అని హోల్డర్ స్పష్టం చేశారు. పవర్‌ప్లేలో అద్భుతంగా రాణిస్తున్న కగిసో రబాడ మరియు మహ్మద్ సిరాజ్ ప్రదర్శనను ఆయన కొనియాడారు. వారిద్దరి ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నారని, ఇది మిగతా బౌలర్లకు పని సులువు చేస్తోందని చెప్పారు.

Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హోల్డర్ మొత్తం 7 వికెట్లు పడగొట్టారు. పంజాబ్‌పై 4 వికెట్లతో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంది.

- Advertisement -