తమిళనాడులో లోకేష్..బీజేపీ మాస్టర్ ప్లాన్?

11
- Advertisement -

టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీ తరుపున ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న టీడీపీ ఎన్డీయే కూటమితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. 2014 లో ఎన్డీయేతో కలిసి ఎన్నికలకు వెళ్ళిన టీడీపీ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయగా ఘోర ఓటమి చవిచూసింది. దాంతో ఈసారి మళ్ళీ ఎన్డీయే పక్షాన చేరడంతో విజయంపై ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయేకు అనుకూలంగా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రచారం చేసేందుకు టీడీపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. .

అక్కడ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మద్యనే ప్రధాన పోరు ఉంటూ వస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీకి అన్నమలై అధ్యక్ష అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ కొంత బలం పెంచుకుంది. దాంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. 39 లోక్ సభ స్థానాలున్న తమిళనాడులో కనీసం 20-30 సీట్లు సాధించేలా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడులో ఉండే తెలుగు ఓటర్లను ఆకర్శించేందుకు నారా లోకేష్ తో ప్రచారం చేయించేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమైనట్లు తెలుస్తోంది. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివశించే ప్రాంతాలలో నారా లోకేష్ ద్వారా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏపీ ప్రభుత్వంపై తనదైన రీతిలో హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ పోలిటికల్ హీట్ పెంచే లోకేష్.. తమిళనాడులో ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.

Also Read:ప్రశాంత్ నీల్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఇదే!

- Advertisement -