నవంబర్ 14న సెల్ ఫోన్లు స్వీచాఫ్ చేయండి

662
mobiles
- Advertisement -

నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్ధుల తల్లితండ్రులు సెల్ ఫోన్లు స్వీచాఫ్ చేసి పిల్లలతో గడపాలని సూచించింది తమిళనాడు విద్యాశాఖ. ఈ మేరకు బాలల దినోత్సవం రోజు విద్యాశాఖ అధికారులు సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే చిన్నారుల తల్లిదండ్రులంతా ఆరోజు సెల్‌ఫోన్లు పక్కనపెట్టి పిల్లలతో గడపాలని తెలిపింది.

ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తల్లిదండ్రులు తమ సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ చేసి పిల్లలతో గడపాలని, దీన్ని వారానికి ఒకసారి లేదా రోజూ కూడా అమలులోకి తీసుకురావచ్చని తెలిపింది. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల వద్ద ఈ విషయంపై ఒత్తిడి తేవాలని కోరింది. పిల్లలు, ఉపాధ్యాయులు దీన్ని ఆచరణలో పెట్టాలని పేర్కొంది. దీనికి సంబంధించి అన్ని స్కూళ్లలో క్యాంపెయిన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -