- Advertisement -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు తమిళిసై సౌందర్ రాజన్ . పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వీ నారాయణస్వామి, ఇతర మంత్రులు హాజరయ్యారు.
ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిరణ్ బేడిని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కిరణ్‌బేడి 2016 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి.
సీఎం నారాయణ స్వామికి కిరణ్ బేడీకి విభేదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఇద్దరు బీజేపీ వ్యక్తులను నియమించడం మొదలుకుని.. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఉచిత బియ్యం, చీరల పంపకాన్ని అడ్డుకోవడం వంటివి వివాదానికి కారణమయ్యాయి. ఆమెను తొలగించాలంటూ సీఎం స్వయంగా దీక్షకు దిగారు.
- Advertisement -